తిరుపతి తుడా: స్విమ్స్‌లో టీటీడీ ప్రాణదాన పథకం కింద పేద రోగికి ఉచితంగా లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రకాశం జిల్లా, కోమరోలు మండలం, మాధవపల్లి చెందిన రోగి ఎం.తిరుమలేశ్వర్‌రెడ్డి (25) గతనెలలో స్విమ్స్‌లో న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిషన్ పొందారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సర్జరీ అవసరమని నిర్ణయించి ప్రాణదాన పథకం కింద విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్విమ్స్‌లో వైద్యసేవ అంటే కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న రోగికి, అతని కుటుంబానికి భరోసాగా నిలవడం కూడా తమ బాధ్యతన్నారు.


