కిక్కు.. తమ్ముళ్లకే లక్కు! | - | Sakshi
Sakshi News home page

కిక్కు.. తమ్ముళ్లకే లక్కు!

Sep 13 2026 9:16 AM | Updated on Sep 13 2026 9:16 AM

● 95 శాతం మద్యం దుకాణాలు టీడీపీ నేతల చేతుల్లోనే ● పోటీలేకుండా రెన్యూవల్‌ పేరుతో మళ్లీ వాళ్లకే కట్టబెట్టేశారు ● 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణం (ఓపెన్‌ కేటగిరి)వారు రూ.60.50 లక్షలు, రిజర్వుడు కేటగిరి వారు రూ.30.30 లక్షలు, పర్మిట్‌ రూము ఎకై ్సజ్‌ పన్ను రూ.5 లక్షలు, పునరుద్ధరణ రిౖటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను రూ.23 లక్షలు(ఓపెన్‌), రూ.11.50 లక్షలు (రిజర్వుడు) చెల్లించాలని చెప్పారు. ● 50వేలకుపైగా 5 లక్షలకు లోపు జనాభా ఉన్న ప్రాంతంలో నిర్వహిస్తున్న దుకాణం వారు రూ.71.5 లక్షలు(ఓపెన్‌ క్యాటగిరి), రిజర్వుడు కేటగిరి వారు రూ.35.8 లక్షలు, పర్మిట్‌ రూము ఎకై ్సజ్‌ పన్ను రూ.7.5 లక్షలు, పునరుద్ధరణ రిౖటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను రూ.27 లక్షలు(ఓపెన్‌), రూ.13.6 లక్షలు (రిజర్వుడు) చెల్లించాలని చెప్పారు. ● 5లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతంలోని వారు రూ.93.5 లక్షలు (ఓపెన్‌), రిజర్వుడు వారు రూ.46.8 లక్షలు, పర్మిట్‌ రూము ఎకై ్సజ్‌ పన్ను రూ.7.5 లక్షలు, పునరుద్ధరణ రిౖటైల్‌ ఎకై ్సజ్‌ పన్ను రూ.35.5 లక్షలు(ఓపెన్‌), రూ.17.8 లక్షలు (రిజర్వుడు) చెల్లించాలని వివరించారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నాగమల్లేశ్వర్‌రెడ్డి, అసిస్సెంట్‌ సూపరింటెండెంట్‌ వాసుదేవచౌదరి పాల్గొన్నారు.

తిరుపతి అర్బన్‌: మళ్లీ మద్యం దుకాణాలను తమ్ముళ్లకే కట్టబెట్టేశారు. టెండర్లు పిలవకుండా, లక్కీ డిప్‌నకు ఛాన్స్‌ లేకుండా, ఽలైసెన్స్‌ ధరలు పెంచకుండా తమ్ముళ్లకే అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్స్‌ను ఈ నెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు పునరుద్ధరణ చేసుకోవాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌ వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఓపెన్‌ కేటగిరిలోను, 22 దుకాణాలు గీత కులాల వారి పరిధిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 30వ తేదీకి లైసెన్స్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఆప్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ ద్వారా తమ లైసెన్స్‌ను 2026–27కి సంబంధించి రెన్యూవల్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెన్యూవల్‌ చేసుకోకుంటే వాటిని ఖాళీలుగా చూపించి కొత్తగా టెండర్లు ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. లైసెన్స్‌ మొత్తాన్ని నాలుగు దశల్లో చెల్లించే సౌకర్యం కల్పించామని వెల్లడించారు. 2026–27కు సంబంధించి వార్షిక రిటైల్స్‌ ఎకై ్సజ్‌ పన్నులో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ఉన్న ధరలే నిర్ణయించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement