రూ.కోటి పరిహారం పొందిన రైతు
కూటమి అండతో ఇప్పుడు మళ్లీ ఆ భూమి తనదేనంటూ మొండికేస్తున్న వైనం
విస్తుపోతున్న బలిజపల్లి వాసులు
రామచంద్రాపురం: కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని పరిహారంగా తీసుకుని మళ్లీ ఆ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆక్రమణకు తెరలేపిన ఘటన మండలంలో కలకలం రేపింది. కూటమి నేతల అండదండలతో సదరు రైతు కబ్జాకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని పీవీపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.210, 211, 212లో ఎనిమిది ఎకరాల భూమిని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే లక్ష్యంతో ‘జగనన్న కాలనీ‘ కోసం సేకరించారు. సదరు భూమికి సంబంధించి యజమాని లోకనాథ్‌రెడ్డికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో సదరు వ్యక్తి ఆ భూమి తనదేనంటూ శనివారం కబ్జాకు యత్నించాడు. తాను ప్రభుత్వానికి ఇచ్చినదే గాక అధనంగా మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.
అనుమతులు లేకుండానే విద్యుత్ లైన్ ఏర్పాటు
ఎలాంటి అనుమతులు లేకుండానే కబ్జాదారుడు విద్యుత్ లైన్‌ను లాగేశాడు. అంతేకాకుండా, హడావుడిగా బోర్ మోటార్ బిగించి, జేసీబీల సాయంతో భూమిని చదును చేసేందుకు భారీ ప్లాన్ వేశాడు.
తహసీల్దార్ వార్నింగ్
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ మధుసూదన్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, జగనన్న కాలనీ కోసం కేటాయించిన భూమి జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నేరుగా జైలుకే వెళ్తావంటూ గట్టిగా హెచ్చరించడంతో కబ్జాదారుడు వెనక్కితగ్గాడు.
గతంలో జగనన్న కాలనీకి ఎనిమిది ఎకరాల సేకణ


