తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, మల్లంగుంట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ లాగిన్‌న్‌ను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండో శనివారం సెలవు రోజున సచివాలయంలో ఉద్యోగులు లేకపోయినా.. ఓ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ సీటులో కూర్చొని పింఛన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ లాగిన్‌న్‌లో నమోదు చేస్తుండడాన్ని గ్రామస్తులు గుర్తించి నిలదీశారు.
లాగిన్ ఉద్యోగిది.. పెత్తనం పార్టీదా?
మల్లంగుంట సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ పదోన్నతితో బదిలీ కాగా ఆమె స్థానంలో మహిళా పోలీసుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆమె కూడా ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగికి చెందిన లాగినన్ ఓ టీడీపీ కార్యకర్త చేతిలోకి ఎలా వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ లాగిన్‌తో ఎవరెవరి పింఛన్ల వివరాలు నమోదు చేశారు? ఎంత మంది దరఖాస్తులు స్వీకరించారు? వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారా..? అనే అంశాలపై జిల్లా అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


