నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పుదూరు గ్రామ సమీపంలో గోశాల వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి చిన్నపాటిగా పొగలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ పి.మురుగన్ చాకచక్యంగా బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించివేసి అప్రమత్తం చేశారు. వివరాలు.. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి ప్రయాణికులను తీసుకుని మల్లాంకు బయలుదేరింది. ఈ బస్సులో 73 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు పుదూరు గ్రామం దాటిన తర్వాత ఇంజిన్‌లో నుంచి చిన్నపాటి పొగ, మంటలు రావడంతో డైవర్ అప్రమత్తమయ్యారు. బస్సు ఇంజిన్ వద్ద వైర్ల రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ తెలిపారు. ఈ విషయమై డ్రైవర్‌తో పాటు కండెక్టర్ కె.కోటయ్య వాకాడు డిపో మేనేజర్‌కు సమాచారం అందించడంతో ఆయన వెంటనే స్పందించి మెకానిక్‌ను పంపించారు. అయితే అరగంట తర్వాత బస్సును స్టార్ట్ చేయడంతో స్టార్ అయ్యిందని, మంటలు రాలేదని కండెక్టర్ వెల్లడించారు.


