అభివృద్ధి పేరుతో ప్రజాధనం స్వాహా | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పేరుతో ప్రజాధనం స్వాహా

Sep 10 2026 3:32 AM | Updated on Sep 10 2026 3:32 AM

ప్రకృతి వనరులను దోచేస్తున్న

కూటమి నేతలు

ఎఫ్‌డీఆర్‌, ఆర్‌ఆర్‌ పనుల్లో

కోట్లాది రూపాయలు స్వాహా

కోట్లాది రూపాయలు మింగేస్తున్న ఎమ్మెల్యే అనుచరులు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలి

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్‌

నాయుడుపేట టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు ప్రజాధనం స్వాహా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూళ్లూరుపేట, ఓజిలితో పాటు పలు మండలాల్లో చేపడుతున్న ఎఫ్‌డీఆర్‌ పనుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఆర్‌ఆర్‌ పనులకు కేటాయించిన రూ.10 కోట్ల నిధుల వ్యయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని సంజీవయ్య విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులకు బినామీ పేర్లతో స్థలాలు కేటాయించి ప్రజా ఆస్తులను సైతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఓజిలి మండలంలోని కుందాం, మాచవరం తదితర గ్రామాల్లోని సెజ్‌ భూముల్లో ప్రభుత్వ అసైన్‌మెంట్‌ భూములను ప్రభుత్వ బినామీ పేర్లతో మార్చి కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం లూటీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్‌ పేరుతో ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఉచిత ఇసుక పథకం మాటున అక్రమ వసూళ్లు, దోపిడీ జరుగుతోందని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తున్నా అధికారులు స్పందించడం లేదని సంజీవయ్య ఆరోపించారు. ఒక్క ఓజిలి మండలంలోనే సగుటూరు చెరువులో ఎఫ్‌డీఆర్‌ నిధులు రూ.10కోట్లు కేటాయించినా అందులోను ఎమ్మెల్యే అనుచరులు దిగమింగుతున్నారని రుజువులతో సహా సంజీవయ్య విలేకరులకు చూపించారు. ఒక్క సగుటూరు చెరువు కట్టపై ఉన్న విలువైన నల్లకర్ర తుమ్మ తదితర చెట్లను పంచాయతీ అనుమతులు లేకుండానే నరికివేసి సుమా రు రూ.50 లక్షలకు పైగా స్వాహా చేశారని ఆరోపించారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాలు సైతం ఉన్నాయని సంజీవయ్య చూపించా రు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంబంధించి బినా మీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అధికారులు సైతం భయపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో, తదితర శాఖల అధికారులు సైతం స్పందించక పోవడం బాధకరమన్నారు.

విచారణ జరిపించండి

నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బినామీలు చేస్తున్న అవినీతిపై ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకపోతే వారం రోజుల్లోగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించి ప్రజలకు పత్రికా ముఖంగా వెల్లడించాలని సంజీవయ్య డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు పార్టీ అధినాయకులు రుజువులు సైతం చూపిస్తున్న విషయం తెలిసిందేనని సంజీవయ్య వెల్లడించారు. దీనిపై నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తప్పుచేయని వారు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

అవినీతి అక్రమాలకు అడ్డాగా సూళ్లూరుపేట

కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం

స్వర్ణముఖి నదిని ధ్వంసం చేస్తున్న టీడీపీ నేతలను పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు వైఎస్సార్‌సీపీకి చెందిన రైతులు, నాయకులపై అక్రమంగా బైయిండోవర్‌ కేసులు నమోదు చేయడం తగదన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఉపేక్షించమన్నారు. ఈ విషయమై డీఎస్పీతో పాటు ఆర్డీవోలను కలిసి అక్రమ కేసులపై ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్‌యాదవ్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, నాయకులు మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథరెడ్డి, అల్లూరు రాహుల్‌రెడ్డి, బైనా మల్లికార్జునరెడ్డి, కటకం జయరామయ్య, పేట చంద్రారెడ్డి, వేణుంబాక మునస్వామి నాయుడు, ఎంపీపీలు కురుగొండ ధనలక్ష్మి, గడ్డం అరుణారెడ్డి, లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ చదలవాడ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement