ఏర్పేడు: ఏర్పేడు మండల వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు సంపతి నవీన్‌కుమార్‌యాదవ్(33) రైలు కింద పడి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికుల కథనం.. ఏర్పేడు మండలం, సీతారాంపేటకు చెందిన సంపతి మణి కుమారుడు నవీన్‌కుమార్‌యాదవ్ శుక్రవారం రాత్రి నుంచి కనబడలేదు. గ్రామ శివారున ఉన్న రైలు పట్టాలపై శనివారం ఉదయం నవీన్ మృతదేహం పడి ఉండడానిన స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు నవీన్‌కు ఇంకా వివాహం కాలేదు. జీవితంపై విరక్తితో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? బహిర్భూమికి వెళుతూ ప్రమాదవశాత్తు రైలు పట్టాలు దాటుతూ మృతి చెందాడా..? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
మాజీ ఎమ్మెల్యే పరామర్శ
సంతపి నవీన్‌కుమార్‌యాదవ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతదేహం వద్ద ఘన నివాళి అర్పించారు. నవీన్ మృతి పార్టీకి తీరని లోటన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్యయాదవ్, మండల ఇన్‌చార్జి గున్నేరి కిషోర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


