భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష
రేణిగుంట: ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఈనెల 25, 26 తేదీల్లో తిరుపతి జిల్లా పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మంగళవారం జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఐఈఎస్‌లో 75వ ర్యాంక్ సాధించిన ఇందుమతికి సత్కారం
తిరుపతి సిటీ: ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్ )పరీక్షలో ఆల్ ఇండియా 75వ ర్యాంక్ సాధించిన తిరుపతికి చెందిన దాసరి ఇందుమతి ని విశ్వ స్కూల్ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లా డుతూ ఇందుమతి నేటి యవతరానికి స్ఫూర్తి దా యకమన్నారు. డిప్లొమో విద్య ఇలాంటి ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. శ్రీ కపిలేశ్వరస్వామి హైస్కూల్ హెడ్‌మాస్టర్ కృష్ణమూర్తి, విశ్వం స్కూల్స్ అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి, టీటీడీ ఉద్యోగి శ్రీ కుమారస్వామి పాల్గొన్నారు.
భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష


