రైతు పొలాన్ని ఆక్రమించిన సొసైటీ సీఈఓ
డక్కిలి:మండలంలోని పాతనాలపాడులో ఘట్టమనేని శ్రీనివాసులు అనే రైతు పొలాన్ని అదే గ్రామానికి గొల్ల పల్లి సొసైటీ సీఈఓ శ్రీనివాసుల అక్రమించి తమపై దౌర్జన్యం చేసి, వరి నాట్లు వేశారని బాధితుడు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి కథనం కథనం మేరకు.. పాతనాలపాడు సర్వే నంబర్ 5లో ఐదు సెంట్లు భూమి తనకు వారసత్వంగా వచ్చిందని, ఆ భూమికి సంబంధించి అడంగళ్, వన్‌బీ మూడు దశాబ్దాలు పైగా తమ పూర్వికుల పేరుతో ఉందన్నారు. అయితే తన భూమిని గొల్లపల్లి సొసైటీ సీఈఓ శ్రీనివాసులు అక్రమించారని తెలిపారు. తాను ఈ అక్రమణ వ్యవహరంపై రెవెన్యూశాఖ అధికారుల కు విన్నవించుకోగా ఈఏడాది జూన్ 5వ తేదీన తమ పొలాన్ని సర్వే చేసి, హద్దులను ఏర్పాటు చేశారన్నా రు. అయితే ఇటీవల ఈహద్దులను శ్రీనివాసులు దౌర్జ న్యంగా తొలగించారని బాధితుడు ఆరోపించాడు. ప్ర స్తుతం తన పొలంలో వరినాట్లు వేసి అడిగితే దౌర్జ న్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక రెవెన్యూ, పోలీసు శాఖల అధికారుల ఫిర్యాదు చేసినా సొసైటీ సీఈఓపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అక్రమణదారుడి నుంచి తమకు సంబంధించిన పొలాన్ని ఇప్పించాలని కోరారు.
రైతు పొలాన్ని ఆక్రమించిన సొసైటీ సీఈఓ


