
రూ.15 వేల పింఛన్‌ను రూ.4 వేలకు మార్పు చేశారు
నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక ఆలయం వీధిలో నివా సం ఉంటున్నాం. పిల్లలకు వివాహాలు చేశాం. భార్యతో కలిసి ఇద్దరమే ఉంటున్నాం. నాకు బ్రెయిన్ స్టోక్ రావడంతో మంచానికే పరిమితం అయ్యాను. దాంతో సదరం సర్టిఫికెట్ 95 శాతం వికలత్వం ఇచ్చారు. రూ.15 వేలు పింఛన్ తీసుకుంటున్నాను. అయితే రెండు రోజుల క్రితం నా ఫించన్ రూ.4 వేలకు తగ్గించామని చెప్పారు. రూ.15 వేలు వైద్య ఖర్చులకు చాలడం లేదు. అప్పులు చేస్తున్నాం. అయితే ప్రస్తుతం పింఛన్ రూ.4 వేలు చేస్తే ఎలా బతకాలి.
– తుమ్మూరు శ్రీరాములు, నాయుడుపేట