
రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
వర్చువల్‌గా ప్రారంభించిన
సీఎం చంద్రబాబు
రేణిగుంట : రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్‌ను బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య అప్పారావు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఆర్డీవో భానుప్రకాష్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పరిశ్రమల యాజమాన్యాలు, అధికారులు పాల్గొన్నారు. అయితే టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఓ ఉద్యోగికి ఫిట్స్ రావడంతో అధికారులు ఆందోళన చెందారు. అతడిని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం