తిరుపతి ఎంపీ ‘వెలుగులు’
● 22 గ్రామ పంచాయతీలకు రూ.21.20 లక్షలతో వీధిలైట్లు
వరదయ్యపాళెం: మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి తన నిధుల ద్వారా వీధిలైట్ల పంపిణీకి చొరవ చూపారు. ఆ మేరకు మండలంలోని 22 పంచాయతీలకు సంబంధించి రాచర్ల, కంచరపాళెం, అరుదూరు, యానాదివెట్టు, కడూరు, తొండంబట్టు, పులివల్లం, మత్తేరిమిట్ట, వరదయ్యపాళెం, కాంబాకం, కురింజల్లం, ముస్లింపాళెం, ఇందిరానగర్, సీఎల్‌ఎన్‌పల్లి, కళత్తూరు, అంబూరు, సంతవేలూరు, నెల్లటూరు, గూడలవారిపాళెం, అయ్యవారిపాళెం, మావిళ్లపాడు, వరదయ్యపాళెం గ్రామ పంచాయతీలకు రూ. 21.2 లక్షలతో వీధిలైట్లను పంపిణీ చేశారు. ఆ మేరకు శుక్రవారం వరదయ్యపాళెం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నాయుడుదయాకర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చిన్నా, రాష్ట్ర చేనేత కార్మిక విభాగం సభ్యులు బొప్పన తిలక్‌బాబు చేతుల మీదుగా కాంట్రాక్టర్ రమణయ్య సర్పంచులకు వీధిలైట్లను అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కన్వీనర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో విద్యుత్ దీపాల పంపిణీకి చొరవ చూపిన ఎంపీ గురుమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ దుడ్డు వేణు, నియోజకవర్గ యూత్ కన్వీనర్ వినోద్‌యాదవ్, మండల సేవాదళ్ కన్వీనర్ నానిరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ సునీల్, నాయకులు రమేష్, మురళీరెడ్డి, రిపువర్థన్ పాల్గొన్నారు.
భర్తపై కేసు
కేవీబీపురం: భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని కాళంగి పంచాయతీ హనుమయ్య కండ్రిగ గ్రామానికి చెందిన ఎం.సుబ్రమణ్యం, స్వాతి భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. సుబ్రమణ్యం తాగుడుకు బానిసై కొంతకాలంగా భార్యను చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈనెల 28వ తేదీన తాగి వచ్చి భార్య స్వాతిని తీవ్రంగా కొట్టి మెడమీద కాలుపెట్టి తొక్కి చంపేందుకు ప్రయత్నించాడు. ఆమెను హుటహుటిన శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్వాతి శుక్రవారం ఫిర్యాదు చేయడంతో భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.


