ప్రతి అర్జీకి పరిష్కారం
తిరుపతి అర్బన్: కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారవేదికకు వచ్చే ప్రతి అర్జీకి అధికారులు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యధికంగా 480 అర్జీలు వచ్చాయి. కలెక్టర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు హాజరై అర్జీలు స్వీకరించారు. అర్జీదారులకు రసీదులు ఇవ్వాల్సిన కౌంటర్ వద్ద రద్దీ నెలకొంది.
న్యాయం చేయండి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకు చెందిన బెనిఫిట్స్ ఇవ్వాలని గూడూరు రూరల్ మండలం, చెన్నూరు పాత గిరిజన కాలనీకి చెందిన అడ్డూరు రమణమ్మ, ఆమె భర్త వేణు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌కు విచ్చేసి అర్జీని అందించారు. వారికి మద్దత్తుగా గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బీఎల్ శేఖర్ నిలిచారు.
మురుగును శుభ్రం చేయండి
నేను దివ్యాంగుడిని. తనపల్లి ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నా. మా కాలనీ చుట్టూ, కాలనీ వద్ద మరుగునీటితో నానా తంటాలు పడుతున్నాం. రెండు సార్లు నేను మురుగునీటిలో జారిపడ్డాను. దొమల బెడద అధికంగా ఉంది. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.
– విజయభాస్కర్, తనపల్లి, తిరుపతి రూరల్ మండలం
ప్రతి అర్జీకి పరిష్కారం
ప్రతి అర్జీకి పరిష్కారం


