బీసీల రిజర్వేషన్లు పెంచాలి  | YSRCP MP R Krishnaiah Met Union Minister Bhupendra Yadav | Sakshi
Sakshi News home page

బీసీల రిజర్వేషన్లు పెంచాలి 

Nov 6 2022 3:46 AM | Updated on Nov 6 2022 3:46 AM

YSRCP MP R Krishnaiah Met Union Minister Bhupendra Yadav - Sakshi

కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇస్తున్న ఆర్‌. కృష్ణయ్య  

సాక్షి, న్యూఢిల్లీ: జనాభా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలలో, విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్‌ కల్పించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌ యాదవ్, బీసీ నేతలు మెట్ట చంద్రశేఖర్, మోక్షిత్‌లు ఢిల్లీలో కేంద్ర కార్మిక, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిసి చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్‌లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు సంబంధించిన 15 అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించామని తెలిపారు. విద్యా, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని కోరినట్టు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement