హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌.. జలవిహార్‌ వద్ద అభిమానుల సందడి | YS Jagan To Visit Hyderabad Today To Attend Wedding Ceremony At Jalavihar, Check Out Full Schedule Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో వైఎస్‌ జగన్‌.. జలవిహార్‌ వద్ద అభిమానుల సందడి

Aug 21 2026 8:49 AM | Updated on Aug 21 2026 11:51 AM

YS Jagan Hyderabad Visit Schedule And Updates

వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటన అప్‌డేట్స్‌..

కొత్త జంటకు వైఎస్‌ జగన్‌ ఆశీర్వాదం.. 

  • జల విహార్‌ చేరుకున్న వైఎస్‌ జగన్‌
  • వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన పెండ్యాల కుటుంబ సభ్యులు
  • నూతన వధువరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌.
  • వైఎస్‌ జగన్‌ను చూసేందుకు భారీగా జల విహార్ చేరుకున్న అభిమానులు.
  • వైఎస్‌ జగన్‌ వెంట భారీగా తరలివచ్చిన అభిమానులు
  • సీఎం సీఎం నినాదాలతో  దద్దరిల్లుతున్న జలవిహార్

 

  • బేగంపేట నుంచి జలవిహార్‌కు బయలుదేరిన వైఎస్‌ జగన్‌
  • వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంట భారీ జనసందోహం.. 

ఎయిర్‌పోర్టు వద్ద కోలాహలం.. 

  • బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్
  • వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన  వైఎస్సార్‌సీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి,  తాటిపర్తి చంద్రశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నాగార్జున, పెండెం దొరబాబు,  పూత్త  ప్రతాపరెడ్డి, కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు
  • బేగంపేట విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ,అభిమానులు
  • మరికాసేపట్లో  జలవిహార్‌లో జరగనున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ  కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్‌ జగన్

👉వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు హైదరాబాద్‌కు బయలుదేరారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో సుమారు రెండు గంటల పాటు వైఎస్‌ జగన్‌ ఉండనున్నారు.

 

హైదరాబాద్‌లో జగనన్న ఫ్లెక్సీలు.. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement