సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్ద సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిర్‌పోర్టు వద్ద వేచి చేస్తున్నారు.

మరికాసేపట్లో వైఎస్ జగన్ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో బేగంపేట్ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ శ్రేణుల రాకతో ఎయిర్‌పోర్టు పరిసర రోడ్లు జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్‌ను చూసేందుకు, స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది.

Hearty welcome @ysjagan Anna 🔥🔥🔥 pic.twitter.com/IQvz55shwJ
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) August 21, 2026
మరోవైపు.. వైఎస్సార్‌సీపీ అభిమానులు హైదరాబాద్‌లో భారీ స్థాయిలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌పై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫొటోలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

YSJAGAN Telangana Hyderabad Visit Draws Attention
YS Jagan is set to arrive in Hyderabad today. Large welcome posters and cutouts have appeared across the city, including a striking @ysjagan @KCRBRSPresident – @KTRBRS display arranged by BRS leader Chirra Ravinder Yadav pic.twitter.com/o2X6BuiKMl— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026


