
ఢిల్లీ: హైదరాబాద్ మెట్రోపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణ ప్రాజెక్టులపై తమ ఆఫీసులో మానటరింగ్ సెల్ ఏర్పాట్లుపై పర్యవేక్షణ చేస్తున్నానని, రీజనల్ రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం నుంచి క్లారిఫికేషన్ లేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ రోజు(గురువారం, సెప్టెంబర్ 25) ఢిల్లీలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు కిషన్‌రెడ్డి.
‘నిధుల సేకరణ అంశాలపై తగిన వివరాలు ఇవ్వాలి. కళ్ళు మూసుకుని ఏ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వదు. మెట్రో పై ఎల్ అండ్ టి నుంచి ఏకాభిప్రాయం కావాలి. దీనిపై ట్రై పార్టీ అగ్రిమెంట్ కావాలి. కాళేశ్వరం పై సిబిఐ దర్యాప్తు అంశం కేంద్రం వద్దకు వచ్చింది. దీనిపై సిబిఐ పరిశీలన చేస్తోంది. ఏ పార్టీతో మేం కలవం. టిఆర్ఎస్‌లో కలిసి కాపురం చేసి, పదవులు తెచ్చుకున్న చరిత్ర కాంగ్రెస్‌ది. మాకు నీతులు చెప్పవద్దు. నేపాల్ లాంటి జెన్ జి నిరసన రావాలన్న కేటీఆర్ డిమాండ్ దేశ ద్రోహం కిందకు వస్తుంది. నేపాల్ లాంటి దాడులను కేటిఆర్ కోరుకుంటున్నారా ?’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.