Nalgonda: Two Constables Were Drunk and Rioting in Nereducharla - Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్ల హల్‌చల్‌!

Jul 22 2023 1:17 PM | Updated on Jul 22 2023 1:29 PM

Two Constables In A Drunken Brawl - Sakshi

నల్గొండ: నేరేడుచర్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్‌చల్‌ చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 19వ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెంలో ఓ బెల్ట్‌షాపు నిర్వాహకుడికి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. అడ్డు చెప్పబోయిన మరో వ్యక్తిపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మద్యం తాగిన కానిస్టేబుళ్లు డబ్బుల విషయంలో ఘర్షణకు దిగారని, మద్యం తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వీరు ఇటీవల హెడ్‌ కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement