హైదరాబాద్: ట్రిపుల్ ఐటీ జంక్షన్ నుంచి డీఎల్‌ఎఫ్‌కు, రాడిసన్ హోటల్ నుంచి ట్రిపుల్ ఐటీ వైపు 90 రోజుల పాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు సైబరాబాద్ కమిషనర్ డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌సిటీ పనుల్లో భాగంగా ట్రిపుల్‌టీ జంక్షన్, డీఎల్‌ఎఫ్ రోడ్డులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
పనులకు ఆటంకం తలెత్తకుండా వాహనాల రాకపోకలను నిషేధించామని చెప్పారు. లింగంపల్లి వైపు నుంచి డీఎల్‌ఎఫ్, విప్రో రోడ్డు నుంచి డీఎల్‌ఎఫ్ వైపు వాహనదారులు నేరుగా ఇందిరానగర్, గచ్చిబౌలి జంక్షన్‌లో ఎడమ వైపు తీసుకోని రాడిసన్ హోటల్ మీదుగా డీఎల్‌ఎఫ్‌కు చేరుకోచ్చన్నారు. రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనదారులు డీఎల్‌ఎఫ్ గేట్ నెంబర్–1 వద్ద యూటర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నారు.


