మంచిర్యాలలో మావోల లేఖ.. ఎమ్మేల్యేకు హెచ్చరిక | Threatening Letter To Mancherial MLA Nadipelli Diwakar Rao From Maoists | Sakshi
Sakshi News home page

మంచిర్యాలలో మావోల లేఖ.. ఎమ్మేల్యేకు హెచ్చరిక

Feb 5 2021 8:52 PM | Updated on Feb 5 2021 9:25 PM

Threatening Letter To Mancherial MLA Nadipelli Diwakar Rao From Maoists - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : మంచిర్యాల నియోజక వర్గంలో మావోయిస్టుల లేఖ కలకలం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు, అతని తనయుడు భూదందాలు, కబ్జాలు ఆపాలని హెచ్చరిస్తూ... మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు. ప్రజల సమస్యలు గాలికి వదిలేసి భూముల సెటిల్మెంట్ల పేరిట అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని లేఖలో తెలిపారు.

గుడిపేటలో 2004లో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిర్మాణం చేపట్టారని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిసిన ఈ ఎమ్మెల్యే ముంపు గ్రామాల ప్రజలకు అండగా ఉంటానని హామీఇచ్చి... ఇప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలేదని ఆరోపించారు.ఎమ్మెల్యే ముంపు గ్రామాల్లో ఉన్న తన అనుచరులు, అధికారులతో కుమ్మక్కై కోట్ల రూపాయాలు కాజేశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ముంపు గ్రామాల నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని అక్కడి నాయకులతో కోర్టులో కేసులు వేయించి... గెలిసిన తర్వాత బాధితుల నుంచి మళ్లీ కమీషన్లు తీసుకున్నారని అన్నారు. గుడిపేటలో ఓ సర్పంచి ఇసుక అక్రమంగా దందా చేస్తున్నారని, వీరి పద్ధతి మార్చుకోకుంటే ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. 
చదవండి: నవ్యా రెడ్డి హత్య: వెనీలా ఆత్మహత్య
చదవండి: నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు

Advertisement
 
Advertisement
Advertisement