నగ్న ఫొటోలు పంపాలని ఇన్‌స్టాలో వేధింపులు | Young person arrested harassment in Instagram | Sakshi
Sakshi News home page

యువకుడిని అరెస్ట్‌ చేసిన హైదరాబాద్‌ పోలీసులు

Feb 5 2021 3:39 PM | Updated on Feb 5 2021 3:40 PM

Young person arrested harassment in Instagram - Sakshi

సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతులను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకొని అనంతరం వారిని నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని వేధిస్తుండడంతో విసుగు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా యాప్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో యువతులను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలను పరిచయం చేసుకొని అనంతరం వారిని నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని వేధిస్తుండడంతో విసుగు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీ అడ్రస్‌ ఆధారంగా దర్యాప్తు చేసి పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఇన్స్టాగ్రామ్‌లో తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. హయత్‌నగర్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ రామన్నగూడెం ప్రాంతానికి చెందిన సంతోశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంతోశ్‌ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement