ఆర్టీసీ ప్రయాణికులకు షాక్‌.. బస్‌పాస్‌ చార్జీలు భారీగా పెంపు | Telangana RTC BUS Pass Charges Hiked | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రయాణికులకు షాక్‌.. బస్‌పాస్‌ చార్జీలు భారీగా పెంపు

Jun 9 2025 1:32 PM | Updated on Jun 9 2025 1:37 PM

Telangana RTC BUS Pass Charges Hiked

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులపై చార్జీల బాదుడుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా బస్‌ పాస్‌ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 20 శాతానికి పైగా బస్‌ పాస్‌ రేట్లను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇక, పెరిగిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. బస్‌ పాస్‌ ఛార్జీలు పెరగడంపై ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పెరిగిన రేట్ల ప్రకారం..  

  • రూ. 1300 ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్‌ పాస్‌ రూ.1600లకు పెంపు

  • రూ.1,150 ఉన్న ఆర్డీనరీ బస్‌ పాస్‌ రూ.1400లకు పెంపు. 

బస్‌ పాస్‌ చార్జీలు భారీగా పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కాలేజీలకు ఎలా వెళ్లాలని విద్యార్థులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement