ఫ్యూచర్‌సిటీలో సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వేదిక కోసం పరిశీలన
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్ నిర్వహణతో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్‌ను ప్రపంచానికి చూపిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరా బాద్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, అద్భుతమైన వాతావరణం, తక్కువ ధరలకు నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయనే విషయాలను గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి తరలిరానున్న పారిశ్రామికవేత్తలకు వివరిస్తామన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక పరిశీలనలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన గచ్చిబౌలి స్టేడియంతోపాటు భారత్ ఫ్యూచర్‌సిటీని సందర్శించారు. సమ్మిట్ కోసం చేపట్టనున్న ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకు న్నారు.
అనంతరం భట్టి విలేకరులతో మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలను 2047 డాక్యుమెంట్ ద్వారా ప్రపంచానికి వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కేబినెట్ ప్రత్యేక నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2047 వరకు తెలంగాణ ఏ రకంగా ఉండబోతోంది..ఏ రకంగా ఉండాలి అనే విషయాలను వివరిస్తామన్నారు.
ఐదు వేదికల పరిశీలన: గ్లోబల్ సమ్మిట్ కోసం నగరానికి నలువైపులా అవసరమైన వేదికలను పరిశీలిస్తున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఇటీవల దుబాయ్ ఫెస్టివల్ నిర్వ హణకు ఒక కొత్త నగరాన్ని దుబాయ్ బయట ప్రాంతంలో ఎంపిక చేసి నిర్వహించారన్నారు. అదే తరహాలో భారత్ ఫ్యూచర్‌సిటీతోపాటు హెచ్‌ఐసీసీ, హైటెక్స్, గచ్చిబౌలి స్టేడి యం, దుండిగల్ ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వేదికలను ఖరారు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు జయేశ్‌రంజన్, సందీప్‌కుమార్ సుల్తానియా, వికాస్‌రాజ్, శశాంక, నర్సింహా రెడ్డి, కృష్ణభాస్కర్, ముషారఫ్‌అలీ, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ తదితరులు పాల్గొన్నారు.


