తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు | Telangana nine IAS Officers Get Postings | Sakshi
Sakshi News home page

తెలంగాణలో 9మంది ఐఏఎస్‌లకు పోస్టింగులు

Dec 15 2023 8:19 PM | Updated on Dec 15 2023 8:46 PM

Telangana nine IAS Officers Get Postings - Sakshi

పలువురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: పలువురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం తొమ్మిది మంది ఐఏఎస్‌లకు వివిధ జిల్లాల్లో బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ముఖ్యకార్యదర్శి(సీఎస్‌) శాంతికుమారి ఉత్వర్వుల్లో సంతకం చేశారు.  

తాజా పోస్టింగ్‌లలో.. హనుమకొండ అడిషనల్ కలెక్టర్‌గా రాధిక గుప్తా, ములుగు అడిషనల్ కలెక్టర్‌గా పి శ్రీజా, జనగాం అడిషనల్ కలెక్టర్‌గా పింకేష్ కుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా లెనిన్ వట్సల్ టోప్పో, భూపాలపల్లి అడిషనల్ కలెక్టర్‌గా కదివరన్ ఐఏఎస్‌లను నియమించారు. 

అలాగే.. నిర్మల్ అడిషనల్ కలెక్టర్ గా ఫైజాన్ అహ్మద్, రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ గా పి గౌతమి, మహబూబ్‌ నగర్‌ అడిషనల్ కలెక్టర్గా సురేంద్ర ప్రసాద్, వనపర్తి అడిషనల్ కలెక్టర్ గా సంచిత గంగువార్‌లను నియమిస్తూ పోస్టింగ్‌ ఉత్తర్వులు పంపించింది తెలంగాణ ప్రభుత్వం.

Advertisement
 
Advertisement
Advertisement