Telangana MLAs Poaching Case: HC Permits AG For Appeal On Order - Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌ న్యూస్‌.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి వెళ్లేది ఆ తర్వాతే..!

Dec 26 2022 7:09 PM | Updated on Dec 26 2022 7:29 PM

Telangana MLAs Poaching Case: HC Permits AG For Appeal On Order - Sakshi

సిట్‌ దర్యాప్తును రద్దు చేస్తూ.. సీబీఐకి వెంటనే కేసు అప్పగించాలన్న హైకోర్టు మళ్లీ.. 

సాక్షి, హైదరాబాద్‌: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ చేతికి వెళ్లాలన్న ఆదేశాలు వెలువడిన కాసేపటికే మరో పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల తుది కాపీ వచ్చేదాకా.. ఇచ్చిన ఆదేశాలను సస్పెన్షన్‌లో ఉంచాలని, తీర్పును ఇంప్లిమెంట్‌ చేయొద్దని సిట్‌ తరపున రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ కోరారు. దీనికి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ తీర్పు.. ఆర్డర్‌ కాపీ అందిన తర్వాతే అప్పీల్‌కు వెళ్తామని ధర్మాసనానికి స్పష్టం చేశారు ఏజీ.  దీంతో అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇస్తామని న్యాయమూర్తి ఏజీకి స్పష్టం చేశారు. అంతకు ముందు.. కేసును సిట్‌ దర్యాప్తు  నుంచి సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అయితే..

తక్షణమే సీబీఐకి అప్పగించాలని తెలిపినప్పటికీ.. ఏజీ అభ్యర్థనను హైకోర్టు న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టు ఆర్డర్‌ కాపీ అందిన తర్వాతే సిట్‌ అప్పీల్‌కు వెళ్లనుంది. ఈ పరిణామంతో.. డివిజన్‌ బెంచ్‌లో తీర్పు తర్వాతే సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక హైకోర్టు ఆర్డర్‌ కాపీ వచ్చిన తర్వాతే తన కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement