కల్తీ కనిపిస్తే ‘కాల్‌’చేయండి: హరీశ్‌

Telangana Minister Harish Rao Comments On Adulterated Food Items - Sakshi

స్పెషల్‌ డ్రైవ్‌ వీక్, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి

ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి

040– 21111111 టోల్‌ ఫ్రీ, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి

సాక్షి,హైదరాబాద్‌: ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడేవారిని ఉపేక్షించకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం), ఆహార భద్రత విభాగం, ల్యాబ్‌ల పనితీరు వాటి పురోగతిపై హరీశ్‌రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆహార కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందని, ఇందులో భాగంగా రూ. 2.4 కోట్లతో నాలుగు అత్యాధునిక ఫుడ్‌ సేఫ్టీ ఆన్‌ వీల్‌ వాహనా లను సమకూర్చుకుందన్నారు. ఐపీఎంలో రూ.10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో ఆహార నాణ్యత నిర్ధారణ ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు.

ఆహార కల్తీని అరికట్టేందుకు జిల్లాల్లో టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేయ డంతోపాటు స్పెషల్‌ డ్రైవ్‌ వీక్‌ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు కేసులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలని సూచించారు. ఆహార కల్తీపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఆహార కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే 040–21111111 నంబర్‌కి కాల్‌ చేయవచ్చని లేదా  ఃఅఊఇఎఏMఇ ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు అందించ వచ్చని తెలిపారు.

బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిల్వలు పెంచేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరిం చాలన్నారు. ఏరియా ఆస్పత్రులకు బ్లడ్‌ బ్యాంకులు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయాలని, తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశిం చారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌ రెడ్డి, పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top