
సుభాష్‌నగర్ (నిజామాబాద్): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఆర్మూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఇటీవల దాడి చేసిన ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా శుక్రవారం నేరుగా ఫోన్ చేసి ఆయనను ఆరా తీశారు. దాడి ఎలా జరిగింది? నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వ్యవహరించిన తీరు గురించి అర్వింద్‌ను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హత్యాయత్నానికి పాల్పడిందని ఎంపీ వివరించగా..వెంటనే ఢిల్లీకి రావాలని స్పీకర్ సూచించారు. దాడి ఘటనను బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి ఘటనపై రెండ్రోజుల్లో ఢిల్లీకి వెళ్లి స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్వింద్ తెలిపారు.