హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటల్ లీలా, NFCL జంక్షన్ గ్రేడ్ సెపరేటర్ పనులు రద్దు చేసింది. హోటల్ లీలా, NFCL జంక్షన్ పనుల టెండర్ రద్దు చేసింది. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణ పరిధిలో పలు మార్పులు చేసింది.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముగ్ధా జంక్షన్ వరకు స్టీల్ ఫ్లైఓవర్, ముగ్ధా జంక్షన్ నుంచి ముఫఖం జా కాలేజీ వరకు మరో స్టీల్ ఫ్లైఓవర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1కు కనెక్టింగ్ ర్యాంప్‌కు అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వం రూ.580 కోట్ల ప్యాకేజీ-1 పనులకు ఆమోదం తెలిపింది. రూ.510 కోట్ల ప్యాకేజీ-2 పనులకు ప్రభుత్వం, ఫ్లైఓవర్ పనులు MEILకు అప్పగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. KBR పార్క్ ఫ్లైఓవర్ పనుల డిజైన్‌లో మార్పులకు ఆమోదం తెలిపింది.


