పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana govt approves recruitment for 5000 posts in telangana police department | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Jul 4 2026 2:59 AM | Updated on Jul 4 2026 1:57 PM

Telangana govt approves recruitment for 5000 posts in telangana police department

కానిస్టేబుల్‌ నుంచి ఎస్సై వరకు భారీ నియామకాలకు ఉత్తర్వులు

త్వరలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలిపింది. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 5 వేల పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయిస్తూ జీఓ ఎంఎస్‌ నం. 78 జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియా మక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) ద్వారా నియామక ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పటా్నయక్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వం పోలీసు శాఖలో ఉన్న ఖాళీలు, శాఖ అవసరాలు, ఆర్థిక భారం తదితర అంశాలను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నియామకాలకు అవసరమైన స్థానిక కేడర్‌ వారీగా ఖాళీలు, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలను పోలీసు నియామక మండలికి వెంటనే అందజేయాలని హోం శాఖ, డీజీపీ కార్యాలయాన్ని ఆదేశించింది. అలాగే నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement