Telangana Education Department Issue Orders Changing Schools Timings - Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం.. బడి వేళలు మార్చుతూ ఉత్తర్వులు

Jul 24 2023 8:41 PM | Updated on Jul 24 2023 9:31 PM

Telangana Education Department Issue Orders Changing Schools Timings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల వేళ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల సమయాలను మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం (రేపటి) నుండి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుండి సాయంత్ర 4.45 వరకు పని చేస్తాయి.

అయితే, విద్యాశాఖ తాజా నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. మరోవైపు తెలంగాణలో వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు రాష్ట్రానికి రెడ్‌ అలెర్ట్‌, హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం కూడా భారీగా వర్షాపాతం నమోదైంది.
(ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు.. ఉత్తర్వులు జారీచేసిన సర్కార్‌)

సమస్యల బడి భవనాలు..
భారీవర్షాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ గత గురు, శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం వెలువడిన వాతావరణ కేంద్రం హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. క్షేత్ర స్థాయిలో తాజా పరిస్థితులను సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. 

అయితే, చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయి. తరగతి పైకప్పులు కురుస్తున్నాయి. వర్షపునీరుతో గదుల్లో బోధన జరిపే అవకాశం తక్కువ. కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈక్రమంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు కొందరు జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. 
(హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement