‘క్యూర్‌’ బిల్లు.. హైదరాబాద్‌ పాలనలో కీలక మార్పులే! | Telangana Core Urban Region Cure Bill-2026 Government Powers | Sakshi
Sakshi News home page

‘క్యూర్‌’ బిల్లు.. హైదరాబాద్‌ పాలనలో కీలక మార్పులే!

Sep 12 2026 5:50 AM | Updated on Sep 12 2026 5:50 AM

Telangana Core Urban Region Cure Bill-2026 Government Powers

ప్రభుత్వానికి పవర్‌

కార్పొరేషన్లకే పాలన బాధ్యతలు

కీలక సందర్భాల్లో సర్కార్‌కు పలు అధికారాలు

స్పష్టం చేస్తున్న ప్రతిపాదనలు

శాసన సభ ముందుకు ‘క్యూర్‌’ బిల్లు  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో శుక్రవారం ప్రతిపాదించిన ‘తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (ఇంటిగ్రేటెడ్‌ గవర్నెన్స్‌) బిల్లు– 2026’ (‘క్యూర్‌’ బిల్లు)  కార్పొరేషన్లకు పాలన బాధ్యతలు అప్పగిస్తూనే.. కీలక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విస్తృత పర్యవేక్షణ, ఆదేశాలు, అధికార బదలాయింపు, సంస్థల పునర్వ్యవస్థీకరణ, అవసరమైతే నేరుగా బాధ్యత చేపట్టే అధికారాలను కలి్పస్తున్నట్లు ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.

సీఎం చైర్మన్‌గా అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌ 
క్యూర్‌ పాలనకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తారు. విధాన దిశ, ప్రాధాన్యాలు,  ప్రణాళికలు, వివిధ శాఖల సమన్వయంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.

అధికారులతో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ 
ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ కన్వీనర్‌గా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంటుంది. కార్పొరేషన్‌ల కమిషనర్లు, సీపీలు, కలెక్టర్లు, విద్యుత్, జలమండలి, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు సభ్యులుగా ఉంటారు.

  • నిరంతర వైఫల్యం, విధులు నిర్వర్తించలేకపోవడం, అధికార దుర్వినియోగం లేదా ఆర్థిక ముప్పు వంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కార్పొరేషన్లను రద్దు చేయవచ్చు. అయితే.. ముందుగా కారణాలు వెల్లడించి వివరణకు అవకాశం ఇవ్వాలి.

మేయర్, డిప్యూటీ మేయర్‌పై చర్య 
విధుల్లో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం, చట్టపరమైన ఆదేశాల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం వంటి సందర్భాల్లో ప్రభుత్వం మేయర్, డిప్యూటీ మేయర్‌ను తొలగించవచ్చు. అంతకు ముందు వివరణకు అవకాశం కల్పించాలి.

కమిషనర్‌ నియామకం
కమిషనర్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. అయితే.. నిరంతర వైఫల్యం, కార్పొరేషన్‌  తీర్మానాల అమలులో నిర్లక్ష్యం వంటి కారణాలతో మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది తొలగించాలని ఓటు వేస్తే ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు.

  • రికార్డులు కోరడం, తనిఖీలు చేయించడం, విధులు నిర్వర్తించాలని ఆదేశించడం, సంబంధిత తీర్మానాలను నిలిపివేయడం/రద్దు చేయడం, అవసరమైతే ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించడం, మేయర్‌ లేదా సభ్యులను సస్పెండ్‌ చేయడం వంటి అధికారాలు ప్రభుత్వానికి ఉంటాయి.

ఆదేశాలు పాటించకపోతే నేరుగా జోక్యం 
ప్రభుత్వ ఆదేశాలను కార్పొరేషన్‌  లేదా సంబంధిత సంస్థ అమలు చేయకపోతే, వివరణకు అవకాశం ఇచి్చన అనంతరం ప్రభుత్వం ఆ పనిని తానే చేపట్టే అవకాశం ఉంటుంది.

సర్కిళ్లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ 
వార్డులు, సర్కిళ్లు, జోన్ల ఏర్పాటు, సరిహద్దుల మార్పు, విలీనం లేదా రద్దుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. వివిధ శాఖల పరిధులను కూడా వీటితో సమన్వయం చేయవచ్చు.

ప్రత్యేక డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ 
వరదలు, భారీ వర్షాలు, ఇతర విపత్తుల నివారణ, సిద్ధత, స్పందన, పునరుద్ధరణ కోసం ప్రత్యేక క్యూర్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తారు. నీటి చార్జీకి అదనంగా ప్రభుత్వం నిర్ణయించే రేట్ల ప్రకారం సివరేజీ చార్జీ విధించవచ్చు. అడ్వర్టయిజ్‌మెంట్స్‌ రెగ్యులేటరీ కమిటీ ద్వారా హోర్డింగులు, సైన్‌ బోర్డులు, ఇతర ప్రకటనల 
అనుమతులు, నియంత్రణ చేపట్టనున్నారు.  

పనుల బదలాయింపు 
ఒక కార్పొరేషన్‌ , అథారిటీ లేదా ఏజెన్సీకి ఉన్న బాధ్యత, అధికారం లేదా విధిని ప్రభుత్వం మరో సంస్థకు బదలాయించవచ్చు. అవసరమైతే సంయుక్తంగా నిర్వహించేలా కూడా చేయవచ్చు.

ఇవి కూడా చదవండి: తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు కీలక బిల్లులు..! ముందున్నవి ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement