బిగ్‌బాస్‌కి ఎంపిక చేయిస్తామని మోసం | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌కి ఎంపిక చేయిస్తామని మోసం

Published Sun, Jan 21 2024 8:07 AM

Tamil Raju  Cheating On Anchor Actress Swapna Chowdary - Sakshi

హైదరాబాద్: తనను బిగ్‌ బాస్‌–7లోకి పంపిస్తామంటూ డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ అమ్మినేని స్వప్న అనే యాంకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్‌ స్వప్న యాంకర్‌గా, ఈవెంట్‌ ఆర్గనైజర్‌గా టాలీవుడ్‌లో పని చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా పంపిస్తానని మా టీవీలో ప్రొడక్షన్‌ ఇన్చార్జిగా పనిచేస్తున్న సత్య బిగ్‌బాస్‌ ఇన్‌చార్జి తమిలి రాజును పరిచయం చేశారు. బిగ్‌ బాస్‌ లోకి వెళ్లడానికి అందులో ఉపయోగించే దుస్తులు ప్రచారం కోసం ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని తమిలి రాజు ఆమెకు సూచించారు. ఈ మేరకు గత ఏడాది జూన్‌ నుంచి దాదాపు రెండున్నర లక్షలు ఆమె అతనికి చెల్లించింది. ఒకవేళ అవకాశం రాకుంటే డబ్బులు తిరిగి ఇస్తానంటూ తమిలి రాజు ఆమెను నమ్మించాడు. 

ఇందుకు సంబంధించి తమిలి రాజు ఆమెకు ఒక అగ్రిమెంట్‌ కూడా రాసిచ్చాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తూ వచ్చాడు. డబ్బుల గురించి ప్రశ్నించగా తాను ఇవ్వనని తేల్చి చెప్పడంతో కొద్దిరోజుల క్రిందట స్వప్న వీడియో రూపొందించి సోషల్‌ మీడియాలోనూ పోస్ట్‌ చేసింది. ఇదే సంఘటనపై శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్‌ 406, 420 కింద రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Anchor Swapna Chowdary: బిగ్‌ బాస్‌ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement