
హైదరాబాద్: అయిదేళ్ల తమ్ముడు అప్లాస్టిక్ అనీమి యా వ్యాధితో బాధపడుతుండగా తన మూలకణాలిచ్చి ప్రాణాలు కాపాడింది ఓ అక్క. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తమ్ముడికి రాఖీ కట్టి.. నేను నీకు ఎప్పటికీ అండగా ఉంటాను అని మనో ధైర్యాన్నిచి్చంది. ఈ ఘటన శనివారం రక్షా బంధన్ సందర్భంగా చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అయిదేళ్ల బాలుడు ఎముక మజ్జ లోపంతో వచ్చే తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియాతో బాధపడుతున్నాడు.
ఈ బాలుడిని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. మూలకణ మారి్పడితో చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఇంటర్ చదువుతున్న అతడి సోదరి తన మూల కణాలు ఇచ్చేందుకు ముందుకు వచి్చంది. కిమ్స్ ఆస్పత్రి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నరేందర్‌కుమార్ తోట ఆధ్వర్యంలో బాలుడికి సోదరి నుంచి సేకరించిన మూల కణాలతో విజయవంతంగా చికిత్స పూర్తి చేశారు. దీంతో ఈ బాలుడికి పునర్జన్మ ప్రసాదించినట్లయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరుడికి రాఖీ కట్టి ఆమె ఆతీ్మయతను చాటి, ధైర్యాన్నిచ్చింది.