18 ఏళ్ల తరువాత.. కన్నీళ్లతో సొంతూళ్లకు సిరిసిల్ల వాసులు!

Siricilla Migrants Returned After 18 Years From Dubai Jail - Sakshi

సాక్షి, సిరిసిల్ల: సుదీర్ఘ కాలం దుబాయ్‌ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన  కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చొరవతో జైలు నుంచి విడుదలైన వీరికి ఆయనే సొంత ఖర్చులతో విమాన టికెట్లు అందజేశారు.

రెండు నెలల క్రితం జైలు నుంచి విడుదలైన సిరిసిల్లకు చెందిన దండుగుల లక్ష్మణ్  రెండు రోజుల క్రితం విడుదలైన రుద్రంగి మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్నారు. పెద్దూరు గ్రామానికి చేరుకున్న శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు కార్మికులు మంగళవారం సిరిసిల్లకు చేరుకున్నారు. 

వచ్చే నెలలో చందుర్తికి చెందిన మరో కార్మికుడు వెంకటేశ్‌ జైలు నుంచి విడుదలై తిరిగి రానున్నానడు. కమ్యూనికేషన్ సమస్య వల్ల దుబాయ్ జైల్లో మగ్గిపోయిన వీరిని విడిపించేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. దీంతో దుబాయ్‌లో జైలు పక్షులుగా మారిన సిరిసిల్ల వాసులు ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం కనీళ్లు, ఆనంద భాష్పాలతో కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారు. 

ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు 

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top