సిద్దిపేటలో రైలు కూతపై హరీష్‌రావు హర్షం | Siddipet MLA Minister Harish Rao Happy Over First Train, Selfie Photo Goes Viral - Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో రైలు కూతపై హరీష్‌రావు హర్షం

Aug 26 2023 3:45 PM | Updated on Aug 26 2023 5:04 PM

Siddipet MLA Minister Harish Rao Happy Over First Train Selfie - Sakshi

ఎట్టకేలకు సిద్ధిపేట వాసుల రైలు ప్రయాణం కల నెరవేరబోతోంది.. 

సాక్షి, సిద్దిపేట: సిద్ధిపేట వాసుల రైలు కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు ప్రయాణాలు ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ నిర్వచించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. 

ఇక సిద్దిపేటలో రైలు కూతపై హర్షం వ్యక్తం చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి హరీష్‌ రావు. ట్రైన్ ముందు సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకున్నారయన. ఎప్పటి నుంచి అనేదానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. అది అతిత్వరలోనే అని తాజా ఫొటోతో సంకేతాలు ఇచ్చారాయన.

సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గానీ ముంబయికి గానీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు యోచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement