తెలంగాణ సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం | Sanjay Jaju Appointed As Telangana Chief Secretary | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎస్‌గా సంజయ్‌ జాజు నియామకం

Jun 26 2026 2:43 PM | Updated on Jun 26 2026 7:17 PM

Sanjay Jaju Appointed As Telangana Chief Secretary

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సీఎస్‌గా సంజయ్‌ జాజును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్‌ జాజు తెలంగాణకు తిరిగి వచ్చారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సంజయ్‌ జాజు ప్రస్తుతం ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

మూడు రోజుల కిందట ఆయన కేంద​ సర్వీసుల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఆయన అంతకుముందు సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ముఖ్యకార్యదర్శిగా, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, విశాఖపట్టణం కమిషనర్‌గా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌గా, నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖ కమిషనర్‌గా, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీగా పనిచేశారు. 

తెలంగాణ కొత్త సీఎస్ గా సంజయ్ జాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement