సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మేనిఫెస్టోలో ఇచ్చినట్లు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. మార్చి 13న సమ్మె నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి నెల గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేయనున్నాం. మేనిఫెస్టోలో ఉన్నవే మేం అడుగుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.


