భర్త కళ్లెదుటే నవ వధువు మృత్యువాత | Road Incident In Hyderabad Newlywed Woman | Sakshi
Sakshi News home page

భర్త కళ్లెదుటే నవ వధువు మృత్యువాత

Oct 11 2026 8:19 AM | Updated on Oct 11 2026 8:19 AM

Road Incident In Hyderabad Newlywed Woman

హైదరాబాద్‌: భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృత్యువాతపడింది. తన కళ్లెదుటే ఈ దారుణం జరగడంతో భర్త కన్నీరుమున్నీరయ్యాడు. చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలో ఈ విషాద ఘటన చోటుచుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌బీనగర్‌కు చెందిన శ్రీకాంత్‌కు ములుగు జిల్లా కేంద్రానికి చెందిన లావణ్య (25)తో 41 రోజుల క్రితం వివాహమైంది. శనివారం మధ్యాహ్నం దంపతులు ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరారు. మలక్‌పేట డీమార్ట్‌ సిగ్నల్‌ వద్దకు చేరుకుంటుండగా ఓ ఆటో వీరి వాహనానికి  తగలడంతో అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. 

అప్పుడే అటుగా వచి్చన ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద లావణ్య పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు అక్కడికి చేరుకొని లావణ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఏపీ అమలాపురానికి చెందిన కె.శ్రీనివాసరావు, జేఎన్‌టీ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటో డ్రైవర్‌పైనా కేసు నమోదు చేశారు. పెళ్లయిన 41 రోజులకే నవవధువు మృతి చెందటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement