రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద కారు బీభత్సం.. ఒకరి మృతి | road accident at rajendra nagar pv expressway | Sakshi
Sakshi News home page

రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే వద్ద కారు బీభత్సం.. ఒకరి మృతి

Jul 1 2024 9:05 AM | Updated on Jul 1 2024 10:21 AM

road accident at rajendra nagar pv expressway

సాక్షి, రంగారెడ్డి: రాజేంద్రనగర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే వద్ద సోమవారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్‌ కారు వేగంగా దూసుకొచ్చి ఢీ వైడర్‌ను ఢీ కొట్టింది. అధికవేగంతో ఉండటంతో ఆ కారు.. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదం కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన ఘటన స్థలానికి ట్రాఫిక్ పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మరలించిన పోలీసలు ఉస్మానియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. అయితే మితిమీరిన వేగమా?. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు.. రేసింగ్‌లో పాల్గొని ఇలా వేగంగా దూసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement