ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి | Road Accident In Adilabad District | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Oct 1 2024 6:56 AM | Updated on Oct 1 2024 8:44 AM

Road Accident In Adilabad District

సాక్షి,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి గుడిహత్నుర్ మండలం మేకలగండి సమీపంలో మాక్స్ పికప్ వాహనం సైడ్ పిల్లర్లను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు,పోలీసులు  క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతులు మొజుద్దీన్ (60), మొయినొద్దీన్ (40),అలీ (8),ఉస్మానొద్దీన్ (10),ఉస్మాన్ (12)పోలీసులు గుర్తించారు.  

మృతులంతా ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వారని తెలుస్తోంది. భైంసాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement