అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు | Rama Ayodhya Kalamkari To Ayodhya | Sakshi
Sakshi News home page

అయోధ్య బాలరామునికి పెడన కలంకారి వస్త్రాలు

May 29 2024 10:38 AM | Updated on May 29 2024 10:38 AM

Rama Ayodhya Kalamkari To Ayodhya

పెడన: అయోధ్య బాలరాముని ఆలయానికి కృష్ణా జిల్లా పెడన నుంచి సహజ సిద్ధ కలంకారి వస్త్రాలను పంపించగా వాటిని మంగళవారం అలంకరించినట్లు పెడన కోరమండల్‌ కలంకారి వస్త్ర సంస్థ యాజమాని పిచ్చుక వరుణ్‌ కుమార్‌ మంగళవారం తెలిపారు. అయో­ద్య బాలరాముని ఆలయానికి చెందిన డిజైనర్‌ సహజ సిద్ధ కలంకారి వస్త్రాలు కావాలని కోరడంతో ఇటీవల ఆల్‌ ఆవర్, ఫ్లోరల్‌ డిజైన్‌తో రూపొందించిన ఎరుపు వస్త్రాన్ని పంపించామన్నారు. 10.5 మీటర్ల వస్త్రాన్ని స్వామి వారికి అలంకరించి ఆలయ వర్గాలు ఫొటోలు పంపించారని తెలిపారు. 

సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం క్రీమ్‌ కలర్, శనివారం నీలం, ఆదివారం పింకు రంగులలో­ని వస్త్రాలను కావాలని సూచించారని, ప్ర­స్తుతం ఎరుపు రంగు వస్త్రాన్ని డిజైన్‌ చేసి పంపించామన్నారు. మిగిలిన రంగులలో వస్త్రా­లను కూడా త్వరలోనే పంపుతామన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీత పిచ్చుక శ్రీనివాసరావు కుమారుడినయిన తనకు ఈ అవకాశం రావడం స్వామి అనుగ్రహమని వరుణ్‌ కుమార్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement