తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది: ప్రధాని మోదీ | PM Narendra Modi Nizamabad Tour October 3rd Live Updates | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది: ప్రధాని మోదీ

Oct 3 2023 8:25 AM | Updated on Oct 3 2023 5:45 PM

PM Narendra Modi Nizamabad Tour October 3rd Live Updates - Sakshi

PM Narendra Modi Nizamabad Tour Updates

5:02PM
ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద ప్రధాని మోదీ ప్రసంగం

►ఇవాళ నేను వంద శాతం వాస్తవం చెప్పేందుకు వచ్చా
►తాను కూడా ఎన్డీఏలో చేరతానని కేసీఆర్‌ అడిగాడు
►ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెప్పాం
►నేను అలసిపోయాను..  కేటీఆర్‌ బాధ్యతలు అప్పగిస్తానని చెప్పారు
►మీరు ఏమైనా రాజులా.. యువరాజుని సీఎం చేయడానికి అని అడిగా
►ప్రజాస్వామ్యంలో ఇది సరైంది కాదని చెప్పా
►ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాను
►కేసీఆర్‌ అవినీతి బాగోతాన్ని చెప్పాను
►అదే ఆఖరి రోజు.. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదు
►కర్ణాటక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నేతలే కాంగ్రెస్‌కు డబ్బులు అందజేశారు

►జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్‌ నా కోసం పెద్ద పెద్ద పూలమాలలు తీసుకొచ్చేవారు
►జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ నాకు స్వాగతం పలికారు
►జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వచ్చారు.. నాపై ప్రేమ కురిపించారు
►జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలిచింది
►జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత సీన్‌ మారిపోయింది
►జీహెచ్‌ఎంసీలో తమకు మద్దతు ఇవ్వమని కేసీఆర్‌ కోరాడు
 

►మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు సలామ్‌
►సర్దార్‌ పటేల్‌ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు
►గుజరాతీ అయిన పటేల్‌ తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి కల్పించారు.
►ఇప్పుడు మరో గుజరాతీ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
►ప్రజాస్వామ్యాన్ని లూటీ స్వామ్యంగా మార్చేశారు
►భారత్‌ లాంటి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఉండాలి
►కుటుంబ పాలన ప్రాముఖ్యత కాదు..
►తెలంగాణలో మొత్తం అధికారం ఒక కుటుంబం దగ్గరే ఉంది
►కుటుంబ పాలన వల్ల నష్టపోయేది యువతే
►తెలంగాణ వల్ల కేసీఆర్‌, కేసీఆర్‌ కొడుకు, కేసీఆర్‌ కూతురు, కేసీఆర్‌ అల్లుడు మాత్రమే లబ్ధిపొందుతున్నారు.

►మీ ఉత్సాహం చూస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది
►తెలంగాణలో ఎక్కడ చూసినా టాలెంట్‌ ఉంది
►కరోనా కష్టకాలంలో తెలంగాణకే దేశానికి వ్యాక్సిన్‌ ఇచ్చింది

►నేను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును నేనే ప్రారంభించాను
►ఎన్టీపీసీ వల్ల తెలంగాణకే ఎక్కువ ప్రయోజనం
►రూ. 8 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించాను
►ఇండియా కూటమి, కాంగ్రెస్‌ మహిళా బిల్లు పాస్‌ కాకుండా కుట్ర చేశారు
►మహిళా బిల్లుకు మద్దతు అని చెబుతూ లోపల కుట్రలు చేశారు
►గత్యంతరం లేకే విపక్షాలు మహిళా బిల్లుకు మద్దతిచ్చాయి
►దేశ మహిళలు ఇచ్చిన శక్తి వల్లే నేను మహిళా బిల్లును పాస్‌ చేయగలిగాను
►నిజామాబాద్‌ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు

4:52PM
ఇందూరు జనగర్జన సభా ప్రాంగణం వద్ద కిషన్‌రెడ్డి ప్రసంగం
►బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ను ప్రజలు కోరుకోవటం లేదు
►ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారు
►త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఒక కుటుంబం పాలైంది
►కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌కు ఓటేసినట్లే
►చాలు కేసీఆర్‌.. సెలవు కేసీఆర్‌
►తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలను ప్రజలు కోరుకుంటున్నారు.
► గతంలో పసుపు బోర్డును ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు
►పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారు
►ఇవాళ రూ. 8 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని ప్రారంభించాం

4:36PM
►నిజామాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌ షో
►మోదీ.. మోదీ అంటూ మార్మోగుతున్న నిజామాబాద్‌
►మోదీపై పూల వర్షం కురిపిస్తున్న ప్రజలు
►ఓపెన్ టాప్ జీపులో ఇందూరు జనగర్జన సభకు మోదీ
►పూల వర్షం కురిపించిన మహిళలు పసుపు రైతులు
►మోదీ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం

4:25PM
ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

►నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ
►మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేస్తుంది
►ఇది మా వర్క్‌ కల్చర్‌
►తెలంగాణ ప్రజల విద్యుత్‌ అవసరాలు తీర్చేందుకు మేము కృషి చేస్తున్నాం
►మెరుగైన విద్యుత్‌ సరఫరా  అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుంది
►త్వరలో భారతీయ రైల్వే 100 శాతం ఎలక్ట్రిఫికేషన్‌ అవుతుంది
►బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ భవనాన్ని మీరు చూస్తున్నారు

4:15PM
►మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
► 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌  విభాగాలకు శంకుస్థాపన
►సిద్దిపేట–సికింద్రాబాద్‌ వరకు తొలి రైలు సర్వీసును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
►సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను ప్రారంభించిన మోదీ
►(ధర్మాబాద్‌ మహారాష్ట్ర)–­మనోహరాబాద్‌–మహబూబ్‌నగర్‌–కర్నూల్‌(ఏపీ)’ రైల్వేలైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం
►పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

4:10PM
► కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం: కిషన్ రెడ్డి
► పసుపు బోర్డు ప్రకటించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కిషన్‌రెడ్డి

03:53PM
►ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణలో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్‌ తమిళసై, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డిలు స్వాగతం పలికారు.

►కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రాక. 
►ప్రధాని మోదీ. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
►అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్న మోదీ. 

► కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో మోదీ రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్య­క్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యట­నలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామా­బాద్‌­లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమ­ర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

► ఇప్పటికే ఇందూరుకు ప్రధాని  పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్‌ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు చెబుతున్నారు. దీనికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు.
చదవండి: రాష్ట్రంలో కారు జోరు.. 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు బీఆర్‌ఎస్‌కే.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement