మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో | Pm Modi Road Show In Malkajgiri Hyderabad | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో

Mar 15 2024 7:07 PM | Updated on Mar 15 2024 7:17 PM

Pm Modi Road Show In Malkajgiri Hyderabad - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్‌ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది. సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్‌పోర్ట్‌ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. నేడు మోదీ రోడ్‌ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement