గోల్డ్‌మేన్‌ సూర్యభాయ్‌పై కేసు | Old City Gold Man Surya Bhai Arrestd | Sakshi
Sakshi News home page

గోల్డ్‌మేన్‌ సూర్యభాయ్‌పై కేసు

Jun 27 2026 7:18 AM | Updated on Jun 27 2026 7:18 AM

Old City Gold Man Surya Bhai Arrestd

హిమాయత్‌నగర్‌: తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని పాతబస్తీకి చెందిన పల్లపు సురేష్‌ కుమార్‌ అలియాస్‌ ‘గోల్డ్‌మేన్‌’సూర్యభాయ్‌ నమ్మబలికి బాధితుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్న ఘటనపై కేసు నమోదైంది. శుక్రవారం నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ సైదేశ్వర్‌ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 10న కృష్ణమాచారి, మరో ఇద్దరు వ్యక్తులు సూర్యను హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్‌లో కలిశారు. తనకు బంగారం వ్యాపారులతో సత్సంబంధాలు ఉన్నాయని, మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఇప్పిస్తానని వారిని నమ్మబలికాడు. మా ర్కెట్‌లో కిలో బంగారం ధర సుమారు రూ.1.5 కోట్లుకాగా, దానిని కేవలం రూ.1 కోటికే అందిస్తానని ఆశ చూపి బాధితుల నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.30 లక్షలు తీసుకున్నాడు. అయితే సూర్యభాయ్‌ను కూడా ప్రశ్నించి తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement