
సాక్షి, హైదరాబాద్: బర్త్ డే పార్టీలో ఉగాండా, నైజీరియాకు చెందిన వారిని పోలీసులు పట్టుకున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో గుట్టుగా నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 51 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిలో 37 మంది మహిళలు, 14 అబ్బాయిలు ఉన్నారు. డ్రగ్స్ పరీక్షల్లో కొంత మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.
ఉగాండాకు చెందిన మమస్ బర్త్ డే పార్టీలో భారీగా మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్స్ పాస్‌పోర్టులు, వీసాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు చెక్ చేస్తున్నారు. ఎక్సైజ్ అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరుపుతున్నట్లు తేలింది. మొయినాబాద్ ఫామ్‌కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ దర్యాప్తు చేపట్టారు.డ్రగ్ డీటెక్షన్ పరికరాలతో 51మందికి పోలీసులు పరీక్షలు..
బర్త్ డే పార్టీలో ఉన్నవారు డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి 11గంటలకు ఎస్‌వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నైజీరియన్స్, పోలీసులు మధ్య రాత్రి వాగ్వాదం జరిగింది. 100 మంది పోలీసులతో ఫామ్‌హౌస్ ముందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం 51 మంది వీసాలు పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు.. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.