Hyderabad: నవ వధువు ఆత్మహత్య | Newly Married Woman Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: నవ వధువు ఆత్మహత్య

Published Sun, Mar 9 2025 1:51 PM | Last Updated on Mon, Mar 10 2025 7:58 AM

Newly Married Woman Ends Life In Hyderabad

బాలానగర్‌(హైదరాబాద్‌): నవవధువు ఆత్మహత్య(Newly Married Woman) చేసుకున్న సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌(Balanagar Police Station) పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా, తర్లా మండలం నందిగామకు చెందిన ఈశ్వరరావుతో గత ఫిబ్రవరి 6న గంటా విజయ గౌరీ (23)కి వివాహం జరిగింది.

 నూతన దంపతులు బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాల్‌రెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈశ్వరరావు ఉద్యోగం నిమిత్తం డ్యూటీకి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి విజయగౌరి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.నరసింహరాజు తెలిపారు.   

ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య 
చైతన్యపురి: ప్రేమించాలంటూ ఓ యువకుడు వేధించడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పాతర్లపాడుకు చెందిన బీమగోని కృష్ణయ్య, మన్నెమ్మ దంపతుల చిన్న కుమార్తె గంగోత్రి (22) చైతన్యపురిలోని తన సోదరి నివాసంలో ఉంటోంది. పాతర్లపాడుకు చెందిన కేశబోయిన మహేష్‌ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ గత ఆరునెలలుగా గంగోత్రిని వేధిస్తున్నాడు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పి తనకు భయంగా ఉందని వాపోయింది. 

తను ఎక్కడికి వెళ్లినా వెంబడించి వేధిస్తున్నాడని తెలిపింది. ఈ క్రమంలో శనివారం ఉదయం గంగోత్రి రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు పిలిచినా పలకకపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపు గడియ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయి కనిపించింది. మహేష్‌ వేధింపుల వల్లే గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని తండ్రి కృష్ణయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement