
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ గిరిజన దినోత్సవం–2025 సందర్భంగా నిర్వహించిన జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో నల్లగొండ సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్ కంది భజరంగ్ ప్రసాద్ తీసిన ఫొటోకు జాతీయ అవార్డు లభించింది. గిరిజన సంస్కృతి విభాగం కింద ఆయన తీసిన ఫొటో ఈ అవార్డుకు ఎంపికైంది.
ఈ విషయాన్ని ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక చైర్మన్, కార్యదర్శి టి. శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న విజయవాడలోని ఎంబీవీకే బాలోత్సవ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డును అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్‌తో కలిసి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ ఈ పోటీని నిర్వహించింది.