రోహిణి.. అందాల రాణి | Miss Aura International India–2026 winner Rohini Kanaka | Sakshi
Sakshi News home page

రోహిణి.. అందాల రాణి

Sep 1 2026 1:47 PM | Updated on Sep 1 2026 1:47 PM

Miss Aura International India–2026 winner Rohini Kanaka

హైదరాబాద్‌: రోహిణి.. అందాల రాణి.. ఎంబీబీఎస్‌ చదువుతూ అందాల పోటీల్లో పాల్గొంటోంది. తాజాగా మిస్‌ ఆరా ఇంటర్నేషనల్‌ ఇండియా–2026 కిరీటాన్ని గెలుచుకుంది. బోడుప్పల్‌ శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉండే కనక రోహిణికి అందాల పోటీల్లో పాల్గొనడమంటే చాలా ఇష్టం. ఆగస్టు 23న అహ్మదాబాద్‌లో ఏక స్టేడియంలో జరిగిన గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.   



👉 మహావీర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో రోహిణి ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. బ్యూటీ బియాండ్‌ అకాడమీలో జశ్నవి మండలా నేతృత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు సిద్ధమవుతోంది. మిస్‌ గ్రాండ్‌ తెలంగాణ 2026లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది.  

👉 కూచిపూడి శాస్త్రీయ నృత్యకారిణిగా కూడా శిక్షణ పొందింది. భారతీయ మూలాలు, సంస్కృతి సంప్రదాయాలతో గాఢమైన అనుబంధాన్ని కొనసాగిస్తోంది. మానసిక ఆరోగ్య అవగాహన కోసం పనిచేస్తూ, ప్రతి ఒక్కరూ తమ మాటను స్వేచ్ఛగా చెప్పగలిగే, గౌరవించే వాతావరణం కల్పించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. 

 


 
కాలనీవాసుల అభినందన... 
శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో నివసించే జయప్రకాశ్‌ సవరప్ప, భారతి కుమార్తె రోహిణి. తల్లిదండ్రులు అందించిన నిరంతర ప్రేమ, అచంచలమై మద్దతుతో రాణిస్తూ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో రోహిణిని, వారి తల్లిదండ్రులను కాలనీ అధ్యక్షుడు తోటకూర చందర్‌ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేమునూరి ముర«ళీధర్, సంఘం ప్రతినిధులు సత్కరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement