తప్పు జరిగింది.. సరిదిద్దుకుంటాం: మంత్రి | Minister Talasani Comments On Double Bedroom Houses In Hyd | Sakshi
Sakshi News home page

తప్పు జరిగింది.. సరిదిద్దుకుంటాం: మంత్రి

Sep 22 2020 4:12 PM | Updated on Sep 22 2020 4:17 PM

Minister Talasani Comments On Double Bedroom Houses In Hyd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లి, కార్వాన్ ప్రాంతాలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లను భోజగుట్టలో కడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. అయితే కోర్టులో కాంగ్రెస్‌ కేసులు వేస్తూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిరలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మీ చెక్కులు భట్టి విక్రమార్క పంపిణీ చేస్తారని తెలిపారు. ఓపెన్‌ నాళాలపై క్యాపింగ్ లేకపోవడం బాధాకరమని మంత్రి తెలిపారు. అధికారుల పొరపాటుతో తప్పు జరిగిందని, సరిదిద్దుకుంటామన్నారు. (మంత్రి కేటీఆర్, మేయర్‌పై సుమేధ తల్లి ఫిర్యాదు)

హైదరాబాద్ అబివృద్దిలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారని, కేటీఆర్ పనితనం గురించి తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్‌ సబ్యులు లొకేషన్ తెలుసుకొని వెళ్ళాలని, లక్ష బెడ్ రూమ్ ఇళ్ల జాబితాలో అప్జల్ సాగర్ లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నవ్వుల పాలు అవుతారన్న మంత్రి కాంగ్రెస్ నేతలకు ఓట్లు ఎవరు వేస్తారని ఎద్దేవా చేశారు.150 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకరకరని విమర్శించారు. జీవిత కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతలు చేసే డ్రామాలు ఆపాలని సూచించారు. (నాలుగు స్థానాలు గులాబీ ఖాతాలోకే..!)

Advertisement
 
Advertisement
Advertisement