
నేరేడ్‌మెట్ : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రాంమోహన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్మే, కార్పొరేటర్లపై ఇటీవల మృతి చెందిన చిన్నారి సుమేధ కపూరియా తల్లి సుకన్య కపూరియ నేరేడ్‌మెట్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. వర్షా కాలంలో ఓపెన్‌నాలాలు పొంగి ప్రవహించడం వల్ల ఈస్ట్‌దీనదయాళ్‌నగర్ కాలనీతో వరదనీటితో ముంపునకు గురవుతుందన్నారు. ఓపెన్ నాలాల సమస్యను పరిష్కారించాలని ఎన్నోసార్లు జీహెచ్‌ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు.
గతంలో ఓగర్భిణి నాలాలో పడి కొట్టుకుపోతుంటే స్థానికులు కాపాడారని, ఈనెల 17న తన కూరుతు సుమేధ నాలాలో పడి మరణించిందన్నారు. కేటీఆర్, మేయర్, జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం,బాధ్యతారాహిత్యమే తన కూతురు మృతికి కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలనిఫిర్యాదులో పేర్కొన్నారు. సుమేధ తల్లి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు దర్యాప్తు చేస్తామని సీఐ నర్సింహ్మాస్వామి చెప్పారు.